NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూర్’లో రైతులకు యూరియా,డీఏపి పంపిణీ..

1 min read

మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం దగ్గర’రైతన్నా- మీకోసం’కార్యక్రమంలో భాగంగా మంగళవారం రైతులకు యూరియా,డిఎపి పంపిణీ చేశారు.మండల వ్యవసాయ అధికారి పీరు నాయక్,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి యూరియా,డిఏపి మందు సంచులను రైతులకు అందజేశారు.కాతా రమేష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజును చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు,అగ్రిటెక్,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం నుంచి మద్దతు వంటి ఐదు విధానాలు అమలు చేస్తున్నామని అన్నారు.ఎంఏవో మాట్లాడుతూ ‘రైతన్నా-మీకోసం’యొక్క ఉద్దేశ్యాలు వివరిస్తూ ఈ సంవత్సరo ఎల్ నినో ప్రభావం గురించి దానికి అనుగుణంగా వ్యవసాయ పంటల సరళిని ఎంచుకోవాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ లు అశోక్,మల్లికార్జున సిబ్బంది నూర్జహాన్,ఉషా మరియు రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *