వివాహ మహోత్సవానికి ఆహ్వానం
1 min read
హోళగుంద న్యూస్ నేడు: హెూళగుంద మండల జమాతే అహలే హదీస్ ప్రెసిడెంట్ ముల్లా సాదిక్ సాబ్ కుమారుని వివాహ మహోత్సవానికి ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి మరియు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివప్రసాద్ లను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. .మంగళవారం వైకుంఠం దంపతులను వారి నివాసంలో కలిసిన ముల్లా సాదిక్ సాబ్ మరియు మైనార్టీ నాయకులు, వివాహ శుభలేఖను అందజేసి తప్పక విచ్చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వివాహ ఏర్పాట్లపై చర్చించి, ముల్లా సాదిక్ సాబ్ కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో మైనార్టీ మండల అధ్యక్షడు ముల్లా మోయిన్, మైనార్టీ విభాగం పెద్దలు సుబాన్, లతీఫ్ మరియు ఇతర ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.

