NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అకాలవర్షాలకు ధాన్యం తడిచిపోకుండా రైతులు  టార్పాలిన్లు వాడాలి

1 min read

జిల్లా జాయింట్ కలెక్టర్ డా: ఎం.జె.అభిషేక్ గౌడ

కొప్పాక గ్రామంలో ధాన్యం రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జెసి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రైతులు తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రాలలో టార్పాలిన్లు తీసుకుని  అకాలవర్షాలకు ధాన్యం తడిచిపోకుండా చూసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా: ఎం.జె.అభిషేక్ గౌడ రైతులకు విజ్ఞప్తి చేశారు. పెదవేగి మండలంలోని కొప్పాక గ్రామంలో గురువారం  ధాన్యం రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రైతులు వారుకోరుకున్న మిల్లు కె ధాన్యం పంపుకోవచ్చని, ధాన్యం మిల్లుకు చేరిన 24 నుండి 48 గంటలలలోగా ధాన్యం సొమ్మును రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు.  ధాన్యం రవాణాలో రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.జేసీ వెంట పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి,తహసీల్దార్ బ్రహ్మరాంభ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇ.అనిల్ కుమారి,ఏఓ సిహెచ్ శ్రీనివాసరావు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author