ఫెన్సింగ్ జాతీయ జట్టు కోచ్ మేనేజర్లుగా ఎంపిక..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 10 నుండి 14 వరకు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా జరగబోయే అండర్-19 బాలుర ఫెన్సింగ్ జాతీయ క్రీడల్లో పాల్గొనే ఏపి జట్టుకు మేనేజర్లుగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వెంకటసురేష్..అలాగే అండర్-19 బాలికల జట్టు మేనేజర్ గా నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాణెమ్మను కోచ్ గా నంద్యాల జిల్లా గడివేముల మండలం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కవితను నియమిస్తూ నంద్యాల జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి పి.జనార్దన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని నంద్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ పెరుమాళ్ళ తెలిపారు. వీరందరూ స్వయానా జాతీయ స్థాయి మరియు విశ్వ విద్యాలయ స్థాయి క్రీడాకారులు మరియు ఎన్నో రాష్ట్ర స్థాయి క్రీడలకు కోచ్ మేనేజర్లుగా వ్యవహరించిన అనుభవం ఉందని ఈ సందర్భంగా కోచ్ మరియు మేనేజర్లుగా నియమితులైన ఫిజికల్ డైరెక్టర్లను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర,నాగరాజు,కోశాధికారి భుజంగ రావు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేసి ఆంధ్రప్రదేశ్ జట్టును క్రమశిక్షణతో ముందుకు నడిపించి విజయంతో తిరిగి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల యస్జిఎఫ్ సహాయ కార్యదర్శులు విశ్వనాధ్, భరత్ రెడ్డి,సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు,నాగరాజు,గోపీ క్రిష్ణ నాయక్,సురేష్ నాయుడు,రాజేష్, ఓబులేసు,చంద్రావతమ్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.