రైతులకు ఎరువుల సరఫరా సక్రమంగా జరగాలి
1 min read
చోదిమెళ్ల రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏపీఏఐయంఎస్ 2.0 ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి బుధవారం ఏలూరు మండలం చోదిమెళ్ల గ్రామ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీఏఐయంఎస్ 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతుల ఈ-క్రాప్ నమోదు వివరాలు, ఆధార్ అనుసంధానం, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల కేటాయింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైతు ఆధార్ నంబర్ నమోదు చేసిన అనంతరం ఓటీపీ ధృవీకరణతో పంట విస్తీర్ణం, పంట వివరాల ఆధారంగా యూరియా, డీఏపీ ఎరువులు దఫాల వారీగా కేటాయించబడుతున్నాయని అధికారులు వివరించారు.ఏపీఏఐయంఎస్2.0 ద్వారా రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందే అవకాశం ఉందని, మొబైల్ నంబర్ నవీకరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపార.”దఫాల వారీగా రైతులకు కేటాయించిన బస్తాలను కొనుగోలు చేసుకోవచ్చును. రైతులు మొబైల్ నెంబరు సొసైటీ వారి లాగిన్‌లో అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం అయింది. ఈ నూతనంగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా రైతులు పంట భూమి విస్తీర్ణాన్ని బట్టి వారికి కేటాయించిన యూరియా మరియు డీఏపీ బస్తాలు అందుబాటులో ఉండునని, ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవలసిందిగా రైతులకు తెలియజేశారు.కార్యక్రమంలో కలెక్టర్ వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హాబీబ్ బాషా,జిల్లా పరిషత్తు సీఇవో పి.జగదాంబ,తహసీల్దారు కె. గాయత్రీదేవి, ఏడీఏ అనిల్ కుమారి, మండల వ్యవసాయ అధికారి జీవన సంధ్య, టెక్నికల్ ఏవో వెంకటేశ్వర్లు, సొసైటీ అధ్యక్షుడు కోనేరు వంశీకృష్ణ, సొసైటీ సిబ్బంది, రైతు సేవ కేంద్రం సిబ్బంది, విస్తరణ అధికారులు, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

