దెందులూరులో వేడుకలా జరిగిన “రైతన్నా మీకోసం”
1 min read

వారోత్సవాల ప్రారంభం-రైతుల ఇంటివద్దకే వెళ్ళి ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాలను వివరణ
నియోజకవర్గ సమస్యలు అడిగి తెలుకున్న ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ,దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ, ప్రతి రైతుకు ఆర్థిక అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన పంచ సూత్రాలను “రైతన్నా, మీకోసం” కార్యక్రమం ద్వారా రైతులకు చేరువ చేస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెదవేగి గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి మర్యాద పూర్వక స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి గ్రామంలోని పలువురు రైతుల ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను, రైతన్న మీకోసం కార్యక్రమం విశిష్టతను, ప్రభుత్వం రూపొందించిన పంచ సూత్రాల ప్రాముఖ్యతను స్వయంగా వివరించారు.కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించడంతోపాటు స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద విడతల వారీగా రైతులకు డబ్బులు అందాయా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలను కూడా తెలుసుకుంటూ,రైతు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు.పెదవేగి మండలం న్యాయంపల్లి వద్ద లిఫ్టు ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు మరింత ఉపయోగ ఉంటుందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, 2014 19 కాలంలో దెందులూరు నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకున్న ఎంతో మంది పేద వారూ బిల్లులు పడక ఎంతో ఇబ్బంది పడుతున్నారని, వారికి సత్వరమే పెండింగ్ బిల్లులు అందించేలా సహకరించాలని, జల జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్న త్రాగునీటి సరఫరా కార్యక్రమంలో విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను దెందులూరు నియోజకవర్గానికి తరలించడానికి బదులుగా సమీపంలోనే ఉన్న పోలవరం రైట్ మెన్ కెనాల్ నుంచి గోదావరి జలాలను ప్రజలకు త్రాగునీరుగా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా అందించడం ద్వారా ఈ ప్రాజెక్టు రూ.280 కోట్ల రూపాయలతోనే పూర్తవుతుందని తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.100 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని, ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గారపాటి రామసీత, గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామమూర్తి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా, రెవెన్యూ డివిజనల్ అధికారి దేవకి, వడ్డీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి , జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోప్పన సుధా, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, మండల పార్టీల అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్, మరడాని రవి, నంబూరి నాగరాజు, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, ముండూరు సొసైటీ చైర్మన్ కొనకళ్ళ శివమణి గౌడ్, లక్ష్మీపురం సర్పంచ్ మేక కనకరాజు, నియోజకవర్గ తెలుగు రైతు విభాగం అధ్యక్షులు విశ్వనాథం,తహసిల్దారులు బత్తిన సుమతి, కృష్ణ జ్యోతి, విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ అనిల సహా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు సహకార సొసైటీల చైర్మన్లు, నీటి సంఘాల చైర్మన్లు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు,రైతులు,వివిధ శాఖల అధికారులు సిబ్బంది, గ్రామస్తులు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

