NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరి సహకారంతో “ఉచిత కంటి వైద్య శిబిరం” విజయవంతం!

1 min read

ముగింపు సభకు విశేష స్పందన

 న్యూస్ నేడు,పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో బెంగళూరు చిట్టెం హనుమాన్ ప్రసాద్,  చెన్నై శంకర నేత్రాలయ ఆసుపత్రి వారి సహకారంతో గత పది రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. శనివారం పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సభ జరిగినది. ఈ కార్యక్రమానికి కంటి వైద్య నిర్వాహకులు చిట్టెం హనుమాన్ ప్రసాద్, శాంతి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ కుమార్, కర్నూల్ వాటర్ రిసోర్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణ నాయక్, పూర్వ విద్యార్థులు శివయ్య,  రామకృష్ణప్ప, వీరేశప్ప లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వారు పుట్టిన ఊరి కోసం ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మన పత్తికొండ లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి ఇక్కడే చికిత్సల అనంతరం కంటి ఆపరేషన్లు చేయడం జరిగిందని, 90 మంది కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు సంతోషంగా ఉన్నారని వారు తెలిపారు. పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు మరియు యువ స్పందన సొసైటీ సభ్యులు ఆధ్వర్యంలో అందరి సహకారంతో  ఉచిత కంటి వైద్య శిబిరం దిగ్విజయంగా ముగిసిందని పేర్కొన్నారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరంలో చెన్నై శంకర్ నేత్రాలయ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందికి మరియు వాలంటీర్లకు మెమోంటో , శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. కంటి ఆపరేషన్లు చేయించుకున్న ఆస్పత్రి వైద్యులు వారికి సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు సురేంద్ర, లక్ష్మన్న.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *