హోరాహోరీగా సాగిన ‘ఈ. అనసూయమ్మ మెమోరియల్’ క్రికెట్ టోర్నమెంట్
1 min read
యువ క్రీడాకారులను ఉత్సాహపరిచిన టీడీపీ యువనాయకులు
గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందిస్తున్న టోర్నమెంట్
మాక్స్ 11 – వందవగలి జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు
క్రీడలు ఐక్యత, క్రమశిక్షణకు ప్రతీక
హోళగుందన్యూస్ నేడు: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ‘ఈ. అనసూయమ్మ మెమోరియల్’ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ మంచి ఆదరణ పొందుతోంది.శనివారం జరిగిన మ్యాచ్‌లో మాక్స్ 11 మరియు వందవగలి జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల ఆటగాళ్లు చివరి వరకు పోరాడటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రతి ఓవర్‌లో ఉత్కంఠ నెలకొనగా ప్రేక్షకులు ఆటను ఆస్వాదిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహించారు.మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్‌ను టీడీపీ మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ నిర్వహించారు. అనంతరం నాయకులు క్రీడాకారులను అభినందించి వారికి ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమానికి టీడీపీ యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ , మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ , యువనాయకుడు ఈబీజీ భువనేష్ గౌడ్ , మండల తెలుగు యువత అధ్యక్షుడు బకాడి వీరేష్ , మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ , మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్ తిమ్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా టీడీపీ యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ మాట్లాడుతూ, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు గ్రామీణ ప్రాంతాల్లోని యువత ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యతాభావం మరియు పోరాటస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు.ఈ టోర్నమెంట్ నిర్వహణ పట్ల స్థానిక యువత, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందిస్తున్నారు.


