PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇకనుంచి వెంకన్న సర్వదర్శన టిక్కెట్లు ఆన్​లైన్​లోనే..!

1 min read

= కోవిడ్ లేని నిర్ధరారణ పత్రం తప్పనిసరి, = 2డోస్​టీకా వేసుకున్నవారికే దర్శనభాగ్యం
పల్లెవెలుగువెబ్​, తిరుపతి: ఇకనుంచి తిరుపతి వెంకన్న దర్శనానికి వచ్చే భక్తులు సర్వదర్శన టక్కెట్లు ఆన్​లైన్​లో కొనుగోలు చేయాల్సిందే. 25నుంచి సర్వదర్శన టిక్కెట్లు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ చైర్మన్​ సుబ్బారెడ్డి బుధవారం ప్రకటించారు. ఈక్రమంలో రోజువారీగా కనీసం 8వేలమంది సర్వదర్శనం చేసుకునేలా ఆన్​లైన్​ టిక్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈమేరకు 26నుంచి ఆఫ్​లైన్​ సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తామన్నారు. అలాగే తిరుమల కొండకు వచ్చే ప్రతిభక్తుడు కోవిడ్​ లేని నిర్థారణ పత్రంతో రావాలని, లేదా 2డోసులు టీకా వేసుకన్న పత్రంతో రావాలని కోరారు. కరోనా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ఈ షరతులు పెట్టామని పేర్కొన్నారు. అక్టోబర్​ నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300టిక్కెట్లను ఈనెల 24న ఉదయం 9గంటలకు ఆన్​లైన్​లో విడుదల చేస్తామన్నారు.

About Author