రాష్ట్రపతి రేసులో గాంధీజీ మనవడు !
1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రపతి పదవి రేసు నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వైదొలగడంతో పశ్చిబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని బరిలో దించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. గోపాలకృష్ణ గాంధీ .. గాంధీజీ-సి.రాజగోపాలాచారిల మనవడు. ఇప్పటికే కొన్ని పార్టీలు ఆయనతో ఫోన్లో చర్చించాయి. తనకు కాస్త సమయమివ్వాలని ఆయన కోరారని.. బుధవారంలోగా నిర్ణయం చెబుతానని అన్నారని తెలిసింది. ఆయన స్పందన సానుకూలంగా ఉందని ఆయనతో మాట్లాడిన నేతలుతెలిపారు. శ్రీలంకలో భారత రాయబారిగా కూడా పనిచేసిన ఆయన.. 2017లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో వెంకయ్యనాయుడిపై పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా ఆయన ప్రతిపక్షాల ఏకగీవ్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ఆయన అంగీకరిస్తే అన్ని విపక్షాలూ ఆయన్నే ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతాయని భావిస్తున్నారు.

