PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందుబాటులోకి రానున్న గరిమా గృహ షెల్టర్లు!

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: హిజ్రాల సంక్షేమం కోసం జిల్లాలో గరిమా గృహ షెల్టర్​హోంలు అందుబాటులోకి తేనున్నట్లు విభిన్నప్రతిభావంతులు, హిజ్రా, వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయసంచాలకులు విజయ గురువారం వెల్లడించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిజ్రాల సంక్షేమం కోసం జిల్లాలో ”గరిమా గృహ “షెల్టర్ హోమ్​లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిరాశ్రయులైన హిజ్రాల సంక్షేమం, వృత్తి నైపుణ్యం , శిక్షణ, వసతి కల్పించడంలో భాగంగా “గరిమా గృహ “పేరుతో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసేందుకు అర్హులైన స్వచ్చంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాల కోసం తమ కార్యాలయం ఫోన్​నెం. 08518– 277684 కు సంప్రదించాలని కోరారు.

About Author