NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రగ్బీ లీగ్ పోటీలలో బాలికల ప్రతిభ…

1 min read

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది

బాలికలను క్రీడల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .

అస్మిత రగ్బీ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవం లో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎక్కడైతే మహిళలను గౌరవించబడతారో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు .కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యా మందిర్ మైదానంలో ఏర్పాటు చేసిన అస్మిత రగ్బీ లీగ్ పోటీల బహుమతుల పదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కర్నూల్ నగరంలో ఏర్పాటుచేసిన  రగ్బీ లీగ్ పోటీలలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటడం అభినందనీయమని చెప్పారు .కేంద్ర ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా అన్ని రంగాలలో మహిళలు ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ప్రయత్నం నీది…. ఫలితం నాది అన్న సూక్తిని ఆయన ఉదహరించారు .ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒంటరితనం తదితర పరిస్థితుల వల్ల యువత చిన్నతనంలోనే చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని ,అదే క్రీడల్లో పాల్గొంటే క్రమశిక్షణ అంకిత భావం పెంపొంది సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా ఎదుగుతారని చెప్పారు.ఈ పోటీల్లో ఇంతమంది బాలికలు పాల్గొనడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర, ప్రైవేటు పి ఈ టి ల సంఘం అధ్యక్షుడు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

About Author