స్థానిక నేతలకే వైకాపా టిక్కెట్ ఇవ్వండి సీఎం గారూ..!
1 min read
స్థానికేతరులకు టికెట్ వద్దంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ.
నందికొట్కూరు టికెట్ స్థానికులకుకేటాయించండి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హాట్ కామెంట్స్..
గత 10 ఏళ్లుగా పార్టీలో పని చేసే వారికి మొండి చేయి.
వలస నేతలకు టిక్కెట్ ఇస్తే ఎలాగని ప్రశ్నింస్తున్న నాయకులు.
స్థానికులకు న్యాయం చేయకుండా కడప వాసులకు టిక్కెట్ ఇస్తే ఊరుకోము.
నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయకపోతే ఎలా జగనన్న అంటూ కామెంట్స్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థిగా స్థానిక నేతలకే వైకాపా టికెట్ ఇవ్వాలి సీఎం గారూ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. స్థానికేతరులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని వాట్సాప్ గ్రూపులలో కామెంట్స్ చేస్తున్నారు. గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాలు..స్థానికంగా ఉంటూ గత పదేళ్లుగా పార్టీ కొరకు కష్టపడి పని చేస్తూ అధిష్ఠానం, స్థానిక నేతలకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఉన్న స్థానిక వైకాపా నేతలకు టిక్కెట్ ఇవ్వకుండా ఎక్కడో ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న నేతలకు వైకాపా టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని, స్థానిక నేతలకే టిక్కెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని నందికొట్కూరు నియోజకవర్గ వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా లో స్థిరపడిన కడప జిల్లాకు చెందిన వ్యక్తి డాక్టర్ సుధీర్నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ కొరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు అనే చర్చ జరుగుతోంది. కడప జిల్లా కు చెందిన వ్యక్తి కావున నందికొట్కూరు నియోజకవర్గ స్థానిక నాయకులు నందికొట్కూరు నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న కొందరు మా లాంటి కార్యకర్త లకు మరియు మా నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే వారిని కాదని ఎక్కడి నుండో దిగుమతి చేసి మాలాంటి నిజమైన కార్యకర్తల మరియు నియోజకవర్గం ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకొని మమల్ని పాలించే సత్తా మా స్థానిక నాయకులకు ఉందని మీకు తెలియకేస్తున్నామంటూ కామెంట్స్ లు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు. కావున మన పార్టీ అధిష్టానం ఎలాంటి తప్పు చేయదని మాకు పూర్తి విశ్వాసం ఉంది అని ఆ విశ్వాసం నిలుపు కొని నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన మాజీ ఎమ్మెల్యే లు ఉన్నారని వారిని కాదని ఇతరులకు ఇవ్వడం సమంజసం కాదు. మా స్థానిక వైకాపా నాయుకులకే టికెట్ ఇవ్వగలరని వారికైతేనే నియోజకవర్గ సమస్యలపై అవగాహన ఉంటుందని, ఏమి చేస్తే మా నియోజకవర్గ ప్రజలకు మంచి జరుగుతుందని, ఏమి చేస్తే మా ప్రజలు అభివృద్ధి చెందుతారో తెలుస్తుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రార్థిస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు . మాకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే నేతలు మాకు వద్దు. ముఖ్యంగా కడప నుండి దిగుమతి చేసుకున్న నాయకుడు వద్దు అంటూ సోషల్ మీడియాలు చక్కర్లు కొడుతోంది ఒక మెస్సేజ్. మరి ఇతర జిల్లాల నుండి వచ్చే వలస నేతలకు ముఖ్యమంత్రి జగన్ టిక్కెట్ ఇస్తాడా లేక నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపించిన నేతలకు టిక్కెట్ ఇస్తారో వేచి చూడాలి. రచ్చ ఎంత వరకు వెళుతుందో చూడాలి.