NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం అవగాహన కార్యక్రమం

1 min read

మేడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌లో

కర్నూలు, న్యూస్​ నేడు:  ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకునే ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవం సందర్భంగా, మేడికవర్ హాస్పిటల్స్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, స్టాఫ్ నర్సులు, ఫ్రంట్ ఆఫీస్ సిస్టర్స్, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్‌కీపింగ్ సిబ్బంది మరియు పేషెంట్స్ పాల్గొన్నారు.ఈ ఏడాది గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే 2025 థీమ్ —అంటే శుభ్రమైన చేతులు మన అందరి చేతుల్లోనే ఉన్నాయి అనే భావనతో, చేతుల శుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు:“చేతులు శుభ్రంగా ఉంచడం ద్వారా అనేక రకాల అంటువ్యాధులను నివారించవచ్చు. ముఖ్యంగా ఆసుపత్రులలో పనిచేసే సిబ్బందికి ఇది అత్యంత అవసరం. ప్రతి ఒక్కరూ సరైన పద్ధతిలో చేతులు కడగడం అలవాటు చేసుకోవాలి, అని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు మరియు హౌస్‌కీపింగ్ సిబ్బంది చేతుల శుభ్రత విధానం ప్రాక్టికల్‌గా చూపించారు. పేషెంట్స్ మరియు వారి బంధువులకు సబ్బుతో చేతులు కడగడం యొక్క ప్రాముఖ్యత వివరించారు.అలాగే, ఫ్రంట్ ఆఫీస్ సిస్టర్స్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి చేతుల శుభ్రత అవగాహనపై చిన్న శిక్షణ సెషన్ కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా అందరికి స్వచ్ఛత పట్ల జాగ్రత్త మరియు బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఉంచారు.మేడికవర్ హాస్పిటల్స్, కర్నూల్‌ సెంటర్ హెడ్ వై. మహేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ,“చేతుల శుభ్రత ఒక చిన్న అలవాటు అయినప్పటికీ, దీని ద్వారా పెద్ద వ్యాధులను నివారించవచ్చు. ఆసుపత్రి పరిసరాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది జీవనశైలిలో భాగం కావాలి” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, చేతుల శుభ్రతపై సంకల్పం తీసుకున్నారు.

About Author