PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు శుభవార్త

1 min read

పల్లెవెలుగువెబ్ : వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు ప్రకటించింది. రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహం అందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో నేడు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రబీ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఈ మేరకు నిర్ణయించినట్టు తెలిపారు.

కేంద్రం నిర్ణయంతో మద్దతు ధర పెరిగిన పంటలు ఇవే…

  1. ఎర్ర కందిపప్పు- క్వింటాలుకు రూ.500 పెంపు
  2. ఆవాలు- క్వింటాలుకు రూ.400 పెంపు
  3. కుసుమ – క్వింటాలుకు రూ.209 పెంపు
  4. గోధుమలు- క్వింటాలుకు రూ.110 పెంపు
  5. బార్లీ- క్వింటాలుకు రూ.100 పెంపు
  6. శనగలు – క్వింటాలుకు రూ.105 పెంపు
  

About Author