ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం హర్షనీయం
1 min read
జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య
మంత్రాలయం, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం హర్షనీయం అని జైభీమ్ ఎమర్పియస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రాలయం మండలం వి. తిమ్మాపురం గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ గ్రూప్ -A రెల్లి ఉపకులాలు (12)కు = 1%, గ్రూప్ -B మాదిగ ఉపకులాలు (18) కు= 6.5%, గ్రూప్ -c మాల ఉపకులాలు (29)కు =7.5% మిగిలిన 0.5%ను 200 రోస్టర్ పాయింట్ లను రెండు దఫాలుగా ఎంపిక చేసి మొత్తం 15% రిజర్వేషన్ కు ఆమోదం తెలిపితే, వన్ మ్యాన్ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ కి పంపిస్తే, జాతీయ ఎస్సీ కమిషన్ గవర్నర్ కు పంపించడం జరిగిందని తెలిపారు. వన్ మ్యాన్ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు చట్టం ద్వారా ఎలాంటి అభ్యంతరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని గురువారం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్సు కు గవర్నర్ గెజిట్,జీవో నెంబర్ 19 ఆమోదం తెలిపి విడుదల చేయించిందని, దీంతో మాదిగలు జీవితాల్లో వెలుతురు వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.