రిడ్జ్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల సీఈఓ గోపినాథ్, కో సీఈఓ సౌమ్య గోపినాథ్, డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపాల్ రాజ్ కమల్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక నృత్యాలు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీఈఓ గోపినాథ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,‘వికసిత్ భారత్’ నిర్మాణంలో నేటి విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాలను అలవర్చుకొని జ్ఞానం, నైపుణ్యాలతో దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.కో సీఈఓ సౌమ్య గోపినాథ్ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. డీన్ రాజేంద్రన్, ప్రిన్సిపాల్ రాజ్ కమల్ ఆధునిక సాంకేతిక విద్యతో పాటు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.


