ఘనంగా ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవ వేడుకలు
1 min read
8వేల 750 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ
బడేటి జన్మదినవేడుకలు జరిపిన పలుస్వచ్ఛంద సంస్థలు
ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవలు అందించాలని అన్ని దేవాలయాల్లో అభిషేకాలు,అర్చనలు పూజలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని ఏలూరు నగరపాలక సంస్థ కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం,టిడిపి సీనియర్ నాయకులు చల్లావెంకటసత్య వరప్రసాద రావు స్పష్టం చేశారు. ఆడంబరాలకు, ఆర్భాటాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే బడేటి చంటి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చేసిన సూచన మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బడేటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలతో ఆప్రాంతం సందడిగా మారింది. పసుపు వర్ణ శోభితమై, కోలాహల వాతావరణంతో నిండిన క్యాంపు కార్యాలయం జనసంద్రాన్ని తలపింపజేసిందంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, బడేటి కుటుంబ సభ్యుల సత్కారాన్ని ఆత్మీయంగా స్వీకరించిన బడేటి మీనా వారి మధ్యే కేక్ కట్ చేశారు. అనంతరం 8వేల 750 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అలాగే ఎరువులు, పురుగు మందులు, విత్తనాల వ్యాపారులు సేవాకేంద్రాలకు ఉపయుక్తంగా ఉండేలా సమకూర్చిన 3 వాటర్ డిస్పెన్సరీలను పంపిణీ చేశారు. గాయత్రీ అనే ఎంసిఎ విద్యార్థినికి ల్యాప్టాప్ను అందించారు. ఈ సందర్భంగా కో – ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టిడిపి సీనియర్ నాయకులు చల్లా వెంకట సత్యవరప్రసాదరావు (కంప్యూటర్ ప్రసాద్) మాట్లాడుతూ తమ అభిమాన నేత, ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా 50 డివిజన్ల పరిధిలోనూ సేవా కార్యక్రమాలను విస్త్రృతం చేశామన్నారు. దాంతోపాటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కూడా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ఉండే ఏలూరు నగర ప్రాంత ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని పలు దేవాలయాల్లో అర్చనలు, అభిషేకాలు, పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి బడేటి రేణుక, డిప్యూటి మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవానీ, టిడిపి నగర అధ్యక్ష, కార్యదర్శులు పెద్దిబోయిన శివప్రసాద్, రెడ్డి నాగరాజు, టిడిపి నాయకులు మోటేపల్లి చంద్రశేఖర్, మామిళ్ళపల్లి పార్థసారధి, బెల్లపుకొండ కిషోర్, కడియాల విజయలక్ష్మి, ఎంబిఎస్ శర్మ, వందనాల శ్రీనివాస్, నాయుడు సోము, మారం అను, లంక రాజాబాబు, కంచన రామకృష్ణ, ఇసుకపల్లి తాతారావు, నౌడూరి వాసు, పూజారి నిరంజన్, పెద్దాడ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఎమ్మెల్యే బడేటి చంటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బడేటి చంటికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.