ఉద్యోగుల డిమాండ్లపై కలెక్టర్ సానుకూల స్పందన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఈ రోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ కర్నూలు జిల్లా కలెక్టర్ డా సిరి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ మీటింగ్ హల్ నందు జరిగినది.సమావేశం నందు కర్నూలు జిల్లా ఏపీ ఎన్టీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ వీ జవహర్లాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న. కర్నూల్ నగర అధ్యక్షులు రామకృష్ణ, ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ ఇస్మాయిల్, టీచర్ల సంఘాల నాయకులు, APSRTC,NMU జిల్లా కార్యదర్శి ఇస్మాయిల్, ప్రభుత్వ నాలుగు తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి ,ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లీలావతి, పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్ కన్వీనర్ గిరి శ్రీకాంత్, రెవిన్యూ అసోసియేషన్ నాయకులు రాజు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ శ్రీ కృష్ణ, టైపిస్టు and స్టేనోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ మరియు జిల్లా, నగర ఏపీఎన్జీవో కార్యవర్గ సభ్యులు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.మరియు జిల్లా, నగర ఏపీఎన్జీవో కార్యవర్గ సభ్యులు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కి 15 డిమాండ్లతో కూడిన మెమొరాండం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా కలెక్టర్ గ మాట్లాడుతూ పై డిమాండ్లపై వివిధ శాఖల జిల్లా అధికారులకు పంపి పై డిమాండ్లను పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దాదాపు పది సంవత్సరాల తర్వాత అంతేకాకుండా రాష్ట్రంలో మొదటిసారిగా కర్నూలు జిల్లాలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఉద్యోగులకు హర్షించదగ్గ విషయమని ఏపీ ఎన్జీవో సంఘపక్షాన కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది.


