గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే.. కూటమి ప్రభుత్వం సంపదను సృష్టిస్తుంది..
1 min read
ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిశుభ్రంగా ఉంచుకువాలి. స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు పన్ను వేస్తే.. కూటమి ప్రభుత్వం చెత్త నుంచి సంపదను సృష్టించి రాష్ట్రాన్ని ఆదాయం తీసుకోవస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు విద్యార్థులతో ఎమ్మెల్యే ర్యాలీ చేపట్టారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ దివస్ వైపు ముందుకు పోతుందన్నారు. తడి, పొడి చెత్త కాకుండా మీ ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ చెత్తను సేకరించి మళ్ళి దాన్ని ఉపయోగించుకునేలా పునరుద్ధరణ చేసి కొత్త ఉత్పత్తిని తయారు చేసే విదంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు కూడా రోడ్డుపై చెత్తను వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందచేసి పరిశుభ్రతకు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.