అశ్రునయనాల మధ్య మహిళా పోలీస్ రాజ్యలక్ష్మి అంత్యక్రియలు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ 6వ సచివాలయంలో మహిళ పోలీస్ గా విదులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జరిగాయి. పత్తికొండ విలేకరిగా పనిచేస్తున్న రాజేష్ గౌడ్ సతీమణి అయిన రాజ్యలక్ష్మి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పత్తికొండ నియోజకవర్గ టిడిపి నాయకులు, సహచార జర్నలిస్టులు, వైసిపి నాయకులు నాగరత్నమ్మ, రామచంద్ర రెడ్డి మృతురాలికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.

