NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముత్తుకూరులో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం – బోరు రిపేర్ పూర్తి

1 min read

ప్రజల ఇబ్బందులపై వెంటనే స్పందించిన వైకుంఠం జ్యోతి, వైకుంఠం ప్రసాద్

ఆలూరు న్యూస్ నేడు: ముత్తుకూరులో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం – గ్రామ ప్రజల్లో ఆనందంఆలూరు నియోజకవర్గ పరిధిలోని ముత్తుకూరు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ఆలూరు టిడిపి ఇంచార్జి  వైకుంఠం జ్యోతి  మరియు రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైకుంఠం ప్రసాద్  ఆదేశాల మేరకు, ఆస్పరి మండలం సింగిల్ విండో డైరెక్టర్ ముత్తుకూరు మల్లికార్జున  వెంటనే స్పందించి బోరును రిపేర్ చేయించారు.వేసవికాలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలో మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరించబడింది.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నాయకులు ఇంత వేగంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *