NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకట్టుకున్న వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రగతి ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రదర్శన

1 min read

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్యుత్తు శాఖలు ప్రగతి ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రదర్శనలు

ప్రజలను విశేషంగా ఆకట్టున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రదర్శన

ప్రదర్శనను తిలకించిన జిల్లా కలెక్టర్,జిల్లా మంత్రి,ఇన్చార్జ్ మంత్రి,ఎంపి,ఎమ్మెల్యేలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఇండోర్ స్టేడియంలో మంగళవారం రెండు ఏళ్ళు నమ్మకం,అభివృద్ధి,సంక్షేమం జిల్లా కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, రెవిన్యూ శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా, ఉద్యాన శాఖ, సెర్ప్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, విద్యుత్తు శాఖలు ప్రగతి ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టు కున్నాయి. ఎగ్జిబిషన్ స్టాల్స్ ప్రదర్శనలను జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్,  ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, డా.కామినేని శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, ఏపీ అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు నగర మేయరు షేక్ నూర్జహాన్ పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపి ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు జుత్తిగ నాగరాజు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, ఏపీ ఎస్సీ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, ఇంచార్చి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.దేవకీ దేవి,ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న,వివిధ శాఖలు జిల్లా అధికారులు,రైతులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *