పింఛన్ల పంపిణీలో..ఎమ్మెల్యే,కమిషనర్
1 min read
ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు.మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ లబ్ధిదారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.వచ్చిన సమస్యలను అధికారులు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పింఛన్లు పెంచిన ఘనత ప్రభుత్వానిదే అని ఈ కూటమి ప్రభుత్వంపై మీ దీవెనలు ఉండాలని ఎమ్మెల్యే వృద్ధులను కోరారు. అదే విధంగా గ్రామంలోని నాలుగవ అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు.తర్వాత పగిడ్యాల మండల పరిషత్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.సమస్యలు పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.అదే విధంగా నందికొట్కూరు పట్టణంలోని వివిధ వార్డుల్లో నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ ఎస్ బేబీ అధికారులతో కలిసి పింఛన్ల నగదును లబ్ధిదారులకు అందజేశారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి అధికారులు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమిత్రమ్మ,ఏసీడీపీఓ బిఏ మంగవల్లి,ఈఓఆర్డి నాగేంద్రయ్య,అంగన్వాడీ సూపర్వైజర్ శేషమ్మ మరియు అధికారులు పాల్గొన్నారు.
