NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐదేళ్లలో స్వార్థం కోసమే పనిచేశారు.. ఎమ్మెల్యే

1 min read

40 రోజుల్లోనే కుప్పం’కు నీళ్లు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు ఆలోచించలేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల హంద్రీనీవా కాలువ నుండి చిత్తూరు జిల్లా కుప్పం’కు నీళ్లు చేరిన సందర్భంగా హంద్రీనీవా కాలువ పంపు హౌస్ కు ఎమ్మెల్యే జల హారతి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మల్యాల హంద్రీనీవా దగ్గర జల హారతి చేసిన 40 రోజులకే కుప్పంకు నీళ్లు చేరాయంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి 14 నెలలోనే నీళ్లు చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని రైతాంగానికి తాగు సాగు నీటిని నందికొట్కూరు నుండి రాయలసీమకు నీళ్లు అందిస్తున్నామని నందికొట్కూరు రైతులు చేసిన త్యాగ ఫలితమే నేడు ఫలాలు పొందుతున్నామని రాబోయే రోజుల్లో తాగు సాగునీటి విషయంలో మా ప్రభుత్వం ముందు ఉంటుందని అన్నారు.తాగు,తాగునీటి గురించి గత ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాదరెడ్డి,డైరెక్టర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, వెంకటేశ్వర్లు యాదవ్,రమేష్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author