ప్రభుత్వ బాలుర వసతి గృహం పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం మరియు శిశుగృహం, సి.క్యాంప్ సెంటర్, కర్నూలు పరిశీలించిన న్యాయమూర్తి గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన శ్రీ ఎన్. శ్రీనివాస రావు గారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు ఈ రోజు అనగా 21-01-2023 న ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం మరియు శిశుగృహం, సి. క్యాంప్ సెంటర్, కర్నూలు ను తనిఖీ చేశారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించి అక్కడ ఉన్న మహిళలకు, పిల్లలకు లీగల్ సర్వీసెస్ ఆక్ట్ మరియు ఉచిత న్యాయ సహాయంను గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం, శ్రీమతి జూబెద బేగమ్, చైర్ పర్సన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది, మేనేజరు, శిశుగృహం, తదితరులు పాల్గొనారు.