పులి కోసం ముమ్మర గాలింపు అత్యంత అప్రమత్తంగా అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్
1 min read
జిల్లా అటవీ శాఖాధికారి (డియఫ్ ఓ) పి.వి.సందీప్ రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ అటవీ దళాల అధిపతి (పీసీసీఫ్ మరియు హాఫ్ ) ఆదేశాల మేరకు ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు మరియు పాపికొండ నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ విస్తృత రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టింది.ఈ ఆపరేషన్‌ను రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఫ్) డాక్టర్ టి. జ్యోతి, ఐ.ఎఫ్.ఎస్, మరియు ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి (డియఫ్ ఓ) పి.వి. సందీప్ రెడ్డి, ఐ.ఎఫ్.ఎస్. క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక నిఘా & బృందాల మోహరింపు
రెస్క్యూ టీమ్‌లు: ఎన్ ఎస్ టి ఆర్ టీమ్ మరియు రాజమండ్రి రెస్క్యూ టీమ్‌లు ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉండి పులి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నాయన్నారు.
సిబ్బంది భాగస్వామ్యంతో ఎంటైర్ డివిజన్ ఫారెస్ట్ సిబ్బంది, టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ విభాగాలు మరియు స్థానిక ప్రజలతో కలిపి సుమారు 350 మందికి పైగా సిబ్బంది రాత్రింబవళ్లు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారన్నారు.ఆధునిక సాంకేతికతతో సమర్థవంతమైన సమాచార మార్పిడికి వాకీ-టాకీలు,విహెచ్ ఫ్ నెట్‌వర్క్‌తో పాటు థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు మరియు నెట్ ఫెన్సింగ్‌ను వినియోగిస్తున్నారన్నారు.ప్రజలకు హెచ్చరికలు మరియు విజ్ఞప్తులు: పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలతో పాటు పోలవరం, రామయ్యపేట, చంద్రాన్న కాలనీ, ఇటికలకోట, నెత్తప్పకోట, ఉడతాపల్లి, వింజరం, సున్నాలగొంది మరియు సమీప గ్రామాల ప్రజలను మైక్ అనౌన్స్మెంట్లు, డప్పు చాటింపుల (టామ్ -టామ్) ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలి: పొలాలకు లేదా అటవీ సరిహద్దులకు వెళ్లేవారు ఒంటరిగా కాకుండా కేవలం గుంపులుగా మాత్రమే వెళ్లాలి. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో బయట సంచరించడం తగ్గించుకోవాలి.పశువుల సంరక్షణకు పశువులను అటవీ సరిహద్దుల వైపు తోలకుండా సురక్షితమైన ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి.వెంటనే సమాచారం అందించాలి: పులి లేదా దాని పాదముద్రలు (పూగమర్క్స్ ) కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.స్వీయ రక్షణ: పులిని చూడటానికి వెళ్లడం, భయపెట్టడం లేదా వెంబడించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.కన్నాపూర్, పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం రేంజ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తతతో ఉన్నారు. స్థానిక ప్రజలు ఎవరూ భయాందోళన చెందకుండా అటవీ శాఖ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి కోరరు.


