NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్​ పరీక్షలకు… ఏర్పాట్లు సిద్ధం

1 min read

నిమిషం ఆలస్యమైతే… నో ఎంట్రీ…

  • ఆర్​ఐఓ గురువయ్య శెట్టి

కర్నూలు, న్యూస్​నేడు:శనివారం జరిగే ఇంటర్​ మీడియేట్​ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ గురువయ్యశెట్టి  తెలిపారు. శుక్రవారం తన ఛాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్​ అమలులో ఉంటుందన్నారు.  సెంటర్లలో తాగునీరు, వైద్యం, ఫ్యాన్లు, విద్యుత్​, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పించామన్నారు.   విద్యార్థులు ఎవరూ నేలపై కూర్చొని పరీక్ష రాసే అవకాశం లేకుండా… అన్ని కేంద్రాలలో ఫర్నీచర్​ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైతే.. పరీక్ష కేంద్రాలకు అనుమతించేది లేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయానికి రావాలని ఈ సందర్భంగా ఆర్​ఐఓ గురువయ్య శెట్టి సూచించారు.  పరీక్ష కేంద్రాలను డీవీఈఓ పరమేశ్వర రెడ్డి, స్పెషల్​  ఆఫీసర్​ లాలప్ప పర్యవేక్షిస్తారన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని, ఫ్లయింగ్​  స్క్వాడ్​ మూడు, సిట్టింగ్​ స్క్వాడ్​ 6 బృందాలను  ఏర్పాటు చేశౄమన్నారు. పరీక్ష కేంద్రాల్లో  ఏమైనా  సమస్యలు వస్తే జిల్లా కంట్రోల్​ రూమ్​ నెం. 08518–222047 ను సంప్రదించాలన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *