ప్రాచీన ప్రాంతీయ సాహిత్య వ్యక్తిత్వ వికాసం అంశంపై అంతర్జాతీయ సదస్సు
1 min read

రెండు రోజులు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం
సెయింట్ థెరిస్సా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ మెర్సి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక సెయింట్ తెరిసా మహిళా స్వయంప్రతిపత్తి కళాశాలలోని తెలుగు.హిందీ విభాగం వారు ప్రాచీన భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై రెండు రోజులు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్:సిస్టర్ మెర్సీ తెలియజేశారు. నెల్లూరు కి చెందిన ప్రాచీన భాషా విశిష్ట అధ్యయన కేంద్రం వారి తొ కలసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. హిందీ తెలుగు విభాగాధిపతి డా:సి. హెచ్. వి.మహాలక్ష్మి మాట్లాడుతూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత పండితులు పరిశోధకులు మరియు భాషావేత్తలను ఒక చోట చేర్చి ప్రాచీన భారతీయ సాహిత్య సంప్రదాయాల జ్ఞానంపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనేలా చేస్తుంది. ప్రాచీన భారతీయ సాహిత్యం అనేది మన సంస్కృతికి ఆధ్యాత్మికతకు మరియు మానవ విలువలకు మూలాధారం వ్యక్తిత్వ వికాసానికి శాశ్వత మార్గదర్శి ఈ సాహిత్యం ఆధునిక సమాజంలో వ్యక్తి సమగ్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది అనేది చర్చనీయాంశం గా కార్యక్రమం సాగబోతోంది. కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మెర్సీ తెలుగు హిందీ విభాగ అధ్యాపకులు మరియు ఐ క్యు ఏసి కో-ఆర్డినేటర్ డాక్టర్ సి ఏ జ్యోతిర్మయి తో కలిసి కార్యక్రమ వివరాలతో కూడిన పత్రికను ఆవిష్కరించారు.

