శ్రీ మద్ది అంజనేయస్వామి వారి దేవస్థానంలో ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
1 min read
హనుమజ్జయంతి ఉత్సవాలు మే 10, 2026 (ఆదివారం) నుండి మే 16, 2026 (శనివారం) వరకు వైభవంగా నిర్వహణ
ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన,ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్
కార్యనిర్వహణాధికారిణి, సహాయ కమిషనర్ ఆర్.వి చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పశ్చిమ గోదావరి జిల్లా, గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది అంజనేయస్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న హనుమజ్జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వాన పత్రిక ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ పద్మశ్రీప్రసాద్ మాట్లాడుతూ, శ్రీ అంజనేయస్వామి వారి అనుగ్రహంతో గ్రామం అభివృద్ధిచెందాలని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.దేవస్థానంలో నిర్వహించే పూజలు, హోమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ హనుమజ్జయంతి ఉత్సవాలు మే 10, 2026 (ఆదివారం) నుండి మే 16, 2026 (శనివారం) వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం జడ్పీటీసి సభ్యులు పల్నాటి బాడ్జి, దేవస్థాన కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

