జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీలకు ఆహ్వానం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారక జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు జనవరి నెల 18 19 తేదీలలో కర్నూలు నగరం నందలి సి క్యాంప్ లో గల టీజీవి కళాక్షేత్రం నందు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఉదయం 11 గంటలకు టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య గచే, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత ,పి,హనుమంతరావు చౌదరి డాక్టర్ బైలుప్పల షఫీ యుల్లా,,,,జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీల గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని రంగస్థలం కళాకారులుజాతీయస్థాయి పౌరాణిక సాంఘిక ఏకపాత్రాభినయ, పోటీలలో పాల్గొనగలరని ఉత్సాహవంతమైన రంగస్థలం కళాకారులకు ప్రోత్సాహవంతమైన నగదు బహుమతులతో పాటు మెమెంటో పాశంశాపత్రాలు అందజేస్తున్నామని కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక నిర్వాహకులు, ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, పి హనుమంతరావు చౌదరి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, వివి రమణ చారి, డీ పుల్లయ్య, డి దస్తగిరి, తెలిపారు. జాతీయస్థాయి పోటీలలో పాల్గొను కళాకారులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు. పోటీలలో పాల్గొన్న ప్రతి కళాకారునికి ప్రశంసా పత్రము అందజేయబడును. ఉత్సాహం ఉన్న రంగస్థలం కళాకారులు, మహిళా కళాకారులు, తమ తమ పేర్లను ముందుగా నమోదు చేసుకోగలరు, టీజీవి కళాక్షేత్రం నందు జరిగిన ఈ జాతీయస్థాయి ఏకపాత్రాభినయ పోటీల గోడపత్రికలను, కళారత్న పత్తి ఓబులయ్య, పి హనుమంతరావు చౌదరి, డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, వివి రమణాచారి, ఎం రాజారత్నం, కే శ్రీనివాసులు, ఎన్ఎస్ చౌదరి, డీ పుల్లయ్య, పిదస్తగిరి, కే నాగ శేషు, ఎస్సెక్షావలి, బండారు బలరాం, ఎస్ జయ రాముడు, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు పాల్గొని గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది.

