NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిన్న విషయానికి ఇంత రాజకీయం అవసరమా..?

1 min read

మాట్లాడే అర్హత టీడీపీ జిల్లా మైనార్టీ నాయకుడు ఖాజా పీర్‌కు ఉంది

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వైసీపీకి తగదు: టీడీపీ నాయకులు

ప్యాపిలి న్యూస్ నేడు: బాధిత కుటుంబాలను ఎవరైనా పరామర్శించవచ్చని, అలాంటి అంశాలపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పరస్పర విమర్శలు చేసుకోవడం సమంజసం కాదని వారు అన్నారు.స్థానిక పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ సుదర్శన్, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుడు ఖాజా పీర్, టీడీపీ నాయకుడు ఎస్.కె. వలి మాట్లాడారు.గత వారం ప్యాపిలి మండలంలోని నల్లమేకలపల్లె గ్రామంలో నీటి కుంటలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అంశంపై ఇరు పార్టీల మధ్య విమర్శలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఖాజా పీర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించడాన్ని ప్రస్తావిస్తూ, ఖాజా పీర్‌కు మాట్లాడే హక్కు లేదన్న వ్యాఖ్యలను వారు ఖండించారు.ఖాజా పీర్‌కు పార్టీలో ప్రత్యేక గుర్తింపు, కేడర్ ఉన్నారని, ప్రజా అంశాలపై మాట్లాడే పూర్తి అర్హత ఉందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే వారికి సహాయం చేయడమే ముఖ్యమని పేర్కొన్నారు.చిన్న చిన్న విషయాలను రాజకీయ వివాదాలుగా మార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, వైసీపీ నాయకులు విమర్శల రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author