రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడం మనందరి బాధ్యత
1 min readడిటిసి ఎస్ శాంత కుమారి,
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని 36 వ, జాతీయ రోడ్డు మాసోత్సవాలు 19 వ, రోజు కొనసాగుతున్నాయి, (GOOD SAMARITAN) అనే కార్యక్రమాన్ని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంత కుమారి ఆధ్వర్యంలో మంగళవారం మెడికవర్ హాస్పిటల్ లో, రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ హాజరయ్యారు, ఈ సందర్భంగా ( GOOD SAMARITAN ) అంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి అనే అంశంపై ఆర్టీవో ఎల్ భారత్ చవాన్ మాట్లాడుతూ, డాక్టర్లకు హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించారు, అవి ఏమనగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ ను పిలిపించి హాస్పిటల్ కు తరలించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారి ప్రమాదాల్లో గంటకు ఒకరు చొప్పున బలి అవుతున్నారు. రహదారి పైన ప్రమాదం జరిగినపుడు, ప్రమాద బాధితులను రక్షించడంలో మొదటి 60 నిమిషాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, మరియు మరణాలు తగ్గించడానికి చాలా కీలకమైనవి. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వారెవరైనా బాధితులకు సహాయం చేసి హాస్పిటల్ కు తీసుకువెళ్ళటానికి సంకోచిస్తారు. సహాయం చేసిన వారిని కూడా మెడికో లీగల్ కేసులో భాగంగా పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది ఇబ్బంది పెడతారనే భయంతో చాలా మంది సహాయం చేయడానికి కూడా సంకోచిస్తారు. రహదారి ప్రమాదాల్లో సహాయం చేసే వారికి రక్షణ కల్పించడానికి భారత ప్రభుత్వం నూతన చట్టం తెచ్చిందని ఆర్టీవో అన్నారు. రహదారి ప్రమాద బాదితులకు సహాయకారిగా వచ్చిన వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది వేధించకూడదు. బాధితుడిని అడ్మిట్ చేసుకోవాలి గాని, సహాయకుని గుర్తింపుగాని, చిరునామా గాని అడిగి వేధించకూడదని డాక్టర్లకు తెలిపారు.పోలీసు స్టేషన్లో కూడా కేసు విషయంలో సహాయకారిని ఏ విధమైన ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగకూడదు. వారి సాక్ష్యం కోసం బలవంతం చేయకూడదన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్ధిన్ ఎంవిఐ లు కే రవీంద్ర కుమార్, ఎం వి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ ఎంవిఐ లు వి బాబు కిషోర్, ఎన్ గణేష్ బాబు, డాక్టర్లు సునీల్ యాదవ్ టీవీ, హెచ్ ఓ డి ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, మెడికవర్ హాస్పిటల్, డాక్టర్ జేషాన్ అహమ్మద్ రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్, ఆర్టిఏ కానిస్టేబులు, విజయ భాస్కర్, చలపతి, హోంగార్డులు, మెడికవర్ ఆసుపత్రి నిర్వాహకుడు మరియు సిబ్బంది, రోగుల బంధువులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.