PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే సమక్షంలో వైసిపిలో చేరిక

1 min read

– యనకండ్ల స్వగ్రామంలో టిడిపి పార్టీకి షాక్.
– యనకండ్ల గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరిక
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నాయకులు నోస్సం సాంబశివారెడ్డి, నొసం మహేశ్వర్ రెడ్డి గొల్ల బ్రహ్మం గడ్డం భాస్కర్ రెడ్డి తోపాటు 10 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామానికి చెందిన టిడిపి పార్టీ నాయకులు నోస్సం సాంబశివారెడ్డి, నోస్సం మహేశ్వర్ రెడ్డి గొల్ల బ్రహ్మం గడ్డం భాస్కర్ రెడ్డితోపాటు 10 కుటుంబాలు ఈరోజు టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈరోజు టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీలో చేరిన వారందరికీ వైఎస్ఆర్ పార్టీలో సముచితస్థానాన్ని కల్పిస్తానని చెప్పారు.ఈ కార్యక్రమం లో యనకండ్ల గ్రామ వైఎస్ఆర్పార్టీనాయకులుకోడూరురామచంద్రారెడ్డి, బనగానపల్లె నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాదుల శివశంకర్ రెడ్డి, బొబ్బల రాజశేఖర్ రెడ్డి, బొబ్బల రామ్మోహన్ రెడ్డి, గొల్ల శేషన్న యాదవ్, బోబ్బల నాగేంద్రారెడ్డి, సంజీవ గౌడ్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author