NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిభ అవార్డ్ అందుకున్న కాంకర్ కళాశాల విద్యార్థి వంశి

1 min read

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి టీ.జి.భరత్

ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి,ఇంచార్జి కలెక్టర్ డా.బి.నవ్య చేతుల మీదుగా అవార్డ్ ప్రదానం

ప్రత్యేకంగా అభినందించిన డి.ఐ.ఇ.ఒ సురేష్ బాబు

అవార్డ్ అందుకున్న విద్యార్థి వంశీని అభినందించిన కాంకర్ కళాశాలల చైర్మన్ కొంకతి వేణుగోపాల్

కర్నూలు అర్బన్ న్యూస్​ నేడు  : ఇంటర్ 2025 ప్రతిభ అవార్డ్ కు కాంకర్ కళాశాల విద్యార్థి వంశి ఎన్నిక అయ్యాడని కాంకర్ కళాశాలల చైర్మన్ కొంకతి వేణుగోపాల్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.కర్నూలు నందు కోడుమూరు రోడ్ పుష్పరాజ్ ఫంక్షన్ హల్ నందు ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డ్ లు ప్రదానం చేయటం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీ.జి.భరత్,

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి,

ఇంచార్జి కలెక్టర్ డా.బి.నవ్య హాజరయ్యారు.ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వీరి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేయటం జరిగిందని అన్నారు.అంతే కాకుండా ప్రత్యేకంగా అభినందించిన డి.ఐ.ఇ.ఒ సురేష్ బాబు.అవార్డు అందుకున్న సందర్భంగా కాంకర్ కళాశాలలో విద్యార్థి వంశీని మరియు తన తల్లిని ఘనంగా సన్మానించారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల చైర్మన్ కొంకతి వేణుగోపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు అవార్డ్స్ ప్రదానం చేయటం చాలా మంచి ఆలోచన అని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.జనరల్ తో పాటు ఇంటర్ ఒకేషనల్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.ఈ సందర్భంగా అవార్డ్ అందుకున్న విద్యార్థి వంశీని అభినందించారు.కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Author