యాగంటీశ్వర స్వామి సన్నిధిలో కాటసాని రాంభూపాల్ రెడ్డి “మాలవిరమణ”
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రానికి పాతపాడు నుంచి కాలినడకన బయలుదేరి యాగంటి క్షేత్రానికి చేరుకుని “శ్రీ ఉమామహేశ్వర స్వామి” వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించి “మాల విరమణ” చేశారు. అనంతరం “శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ” ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ,సతీమణి శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ మరియు యువనాయకుడు శ్రీ కాటసాని శివ నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
