మృతుల కుటుంబాన్ని పరామర్శించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం తెల్లవారుజామున గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శిని హొటల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మరెడ్డి కుటుంబ సభ్యులంత కలిసి నంద్యాలకు కారులో వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి,లక్ష్మిసుబ్బమ్మ భార్యాభర్తలు మృతి చెందారు.. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మార్చారిలో ఉన్న మృత దేహాలను చూసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.