కర్నూలు మేయర్ అభ్యర్థి శ్రీమతి బొల్లెద్దుల ప్రత్యుష కి మద్దతుగా కోడుమూరు ఎమ్మెల్యే పిలుపు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి బొల్లెద్దుల ప్రత్యుష విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి పిలుపునిచ్చారు.కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కర్నూలు కార్పొరేషన్ 51, 52, 53, 54వ వార్డుల ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తూ ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ పంచాలింగాల నాగరాజు , మేయర్ అభ్యర్థి శ్రీమతి బొల్లెద్దుల ప్రత్యూష , కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


