టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి 24 కుటుంబాలు చేరిక..!!!
1 min read
కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మరియు కాటసాని శివ నరసింహారెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు, కార్యకర్తలు..!
కర్నూలు, న్యూస్ నేడు: కల్లూరు మండలం పెద్దటేకూరు మజరా దొడ్డిపాడు గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు 24 కుటుంబాలు ఆ పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి సమక్షంలో వారు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారందరినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీ నాయకత్వంపై నమ్మకంతో, పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రజల కోసం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు పార్టీలో చేరడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.పార్టీలో చేరిన వారిలో అస్లాం, మహబూబ్ బాషా, ముక్తార్, ఖాసిం, హబీబ్ భాష, మాలిక్ భాష, ఇంతియాజ్, పెద్ద కాశీం, చిన్న కాశీం, హుస్సేన్, ఇస్మాయిల్, మౌలాలి, షాలు, పీ. మౌలాలి, చాంద్ భాష, కాజా, ఆన్సర్, మదర్సా, జావీద్, రహమతుల్లా తదితరులు ఉన్నారు..ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు హనుమంత్ రెడ్డి, చంద్రా రెడ్డి, మహేష్, మహేశ్వర్ రెడ్డి, ఫక్రుద్దీన్, మహమ్మద్ రఫీ, అబ్దుల్ సుకుర్, నబి రసూల్, సలీం, అల్లావుద్దీన్, రఫీక్, మునీర్ బాషా, సుభాన్, సుధాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.


