NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు నగర 15వ డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయానికి విస్తృత ప్రచారం

1 min read

హస్తం గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి – యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే లక్ష్యం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోయ క్రాంతి నాయుడు

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగర 15వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హఫీజ్ డా. బోజి అథీఫ్ అలీ ఖాన్ విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొని హస్తం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ జిల్లా చైర్మన్, న్యాయవాది బోయ క్రాంతి నాయుడు, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి నాగ మధు యాదవ్ ప్రజలను కోరారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, యువతకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడం లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. యువతకు నాయకత్వ అవకాశాలు కల్పించి, ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నిబద్ధత కలిగిన నాయకులను ప్రోత్సహించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.15వ డివిజన్‌ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు ప్రజాస్వామ్య బలోపేతానికి, స్థానిక అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, హస్తం గుర్తుపై ఓటు వేసి హఫీజ్ డా. బోజి అథీఫ్ అలీ ఖాన్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.యువత, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా పాల్గొని, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ఆదరించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ప్రజల కోసం – ప్రజలతో కలిసి – ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ ప్రదీప్ రాయల్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఒసామా, రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *