PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొరటాల మూవీ హిందీ రీమేక్‌

1 min read

సినిమా డెస్క్: భాయ్‌ ఓకే అంటే రైటర్స్‌ ఎంతో మంది బోలెడు కథలు ఇస్తారు. ఆయనకి స్టోరీ ఇస్తామంటూ ఎంతోమంది క్యూ కడుతున్నారు. అయినా కూడా సౌత్‌ సినిమా రీమేక్స్‌పై ఎంతో ఆసక్తి సల్మాన్ ఖాన్‌కి. ఇప్పటికే హలోబ్రదర్, కిక్, రెడీ లాంటి సినిమాలను హిందీలోకి చేశాడు. ఇప్పుడు మరో రీమేక్‌ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఎన్టీఆర్‌‌ హీరోగా కొరటాల శివ తీసిన సూపర్ డూపర్ హిట్‌ ‘జనతా గ్యారేజ్’. సల్మాన్‌తో సినిమా తియ్యాలని ఏడాది కాలంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. దానికి సల్మాన్‌ కూడా సై అనడంతో ఇష్టపడటంతో ‘జనతా గ్యారేజ్‌’ని అతనితో రీమేక్ చేయడానికి మైత్రి సంస్థ నిర్ణయించుకుందని అంటున్నారు. చర్చలు కూడా ముగిశాయని, టైమ్‌ చూసి అనౌన్స్‌ చేయాలని అనుకుంటున్నారట. హీరోయిజానికి కూడా ఫుల్‌ స్కోప్ ఉంటుది, కమర్షియల్ ఎలిమెంట్స్‌ మిస్ అవ్వకుండా మంచి సోషల్ మెసేజ్‌తో తీసిన సినిమా ఇది. కాబట్టి సల్మాన్ ఇమేజ్‌కి ఇది కరెక్ట్‌గా సూటవుతుంది అంటున్నారంతా.

About Author