కర్నూలు… హరి హర క్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/11-13.jpg?fit=550%2C367&ssl=1)
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక సంకల్పాగ్ నందు ఉన్న హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిసాయి. గత నెల 30 తేదీన ధ్వజారోహనతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు వైభవంగా నిర్వహించారు. ఈరోజు పవిత్ర తుంగభద్ర నదిలో మీద పండితులు స్వామి వారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తున్న సందర్భంలో మూడు గరుడ పక్షులు వచ్చి చక్రస్నానం నిర్వహిస్తున్న పై భాగంలో ప్రదక్షిణలు చేసి వెళ్లడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పది రోజులపాటు భక్తిశ్రద్ధలతో తిరుమలలో నిర్వహించే విధంగానే ఇక్కడ కూడా నిర్వహించడం వల్ల స్వామివారి అనుగ్రహం వల్లనే గరుడ పక్షులు ప్రదక్షిణలు చేశాయని భక్తులు చెప్పుకుంటున్నారు. అలాగే చక్ర స్నానానికి ముందు తేలికగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహం, చక్రస్నానం అనంతరం బరువెక్కి పోవడం కూడా వెంకటేశ్వర స్వామి మహిమకు నిదర్శనమని పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం నేతలు దుర్గాప్రసాద్, శ్రీధర్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/111-3.jpg?resize=550%2C367&ssl=1)