ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ (ఐడీసీ) ప్రారంభం
1 min read

ప్రారంభించిన పోస్టల్ సూపరిండెండెంట్ ఎస్.శ్రీధర్ బాబు
ఐడీసీ ద్వారా ఉత్తరాలు బట్వాడా డెలివరీ వేగవంతం
ప్రజలందరూ ఈ కొత్త తరహా డెలివరీ విధానం సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :ఏలూరు ఆర్.ఆర్. పేట, పోస్టల్ శాఖ వారి పార్సెల్ హబ్ బిల్డింగు నందు ఇండిపెండెంట్ డెలివరీ సెంటర్ ఐడిసి ను ఏలూరు తపాలా సూపరింటెండెంట్ సురకత్తుల శ్రీకర్ బాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐడిసి ఏర్పాటు ద్వారా ఏలూరు పట్టణంలోని అయిదు తపాలా కార్యాలయాలు అనగా ఏలూరు పెద్ద పోస్ట్ ఆఫీస్, వెంకటరావు పేట, నరసింహారావు పేట,ఏలూరు రైల్వే స్టేషన్ మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు గల పోస్ట్ మాన్ సిబ్బంది ఒకే కేంద్రం నుండి ఉత్తరాల బట్వాడా చేయనున్నారు. ఈ ఐడిసి ద్వారా ఉత్తరాల బట్వాడా వేగవంతం మరియు మెరుగైన సేవలు ప్రజలకు అందించే లక్ష్యంతో పోస్ట్ మాన్ సిబ్బందికి మోటార్ బైకుల మీద వెళ్ళే వెసులుబాటు కల్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ ఐడిసి లో ఆదివారం మరియు సెలవు దినములలో ఉత్తరాల బట్వాడా జరిగే విధంగా తగు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ కొత్త తరహ డెలివరీ విధానం యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కార్యక్రమంలో ఏలూరు అసిస్టెంట్ తపాలా సూపరింటెండెంట్ డి. శ్రీనివాస రావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ యు. చంద్ర శేఖర్, ఐడిసి ఇంచార్జ్ ఎం. శ్రీనివాస రావు మరియు ఏలూరు టౌన్ నందరి ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

