పారా లీగల్ వాలంటీర్ లకు చట్టాలపై అవగాహన
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాద్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవా సదన్ నందు పారా లీగల్ వాలెంట్రీస్ కు చట్టాలపై అవగాహన ఇవ్వడం జరిగింది. న్యాయ సేవల సహాయం కోసం మరియు న్యాయ సేవల విస్తృత ప్రచారం కోసం వీరిని ఉపయోగిస్తామని కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. అనంతరం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ హరినాధ్ పారా లీగల్ వాలంటీర్స్ యొక్క విధులు పై మరియు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ పారా లీగల్ వాలంటీర్స్ న్యాయ సేవలు అవసరం యైన వాళ్లకు న్యాయ సహాయం అందించడం లో తోడ్పాడుతారని తెలిపారు.