NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమ్మకు హెల్త్ చెకప్ బహుమతిగా ఇద్దాం వరల్డ్ మదర్స్ డే

1 min read

డా. ఎం. సంధ్య కన్సల్టెంట్ అబ్ స్ట్ట్రిక్స్ & గైనాకాలజీ,

కిమ్స్ కడల్స్ కర్నూలు.

కర్నూలు,న్యూస్​ నేడు: అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇంట్లో ప్రతీ ఒక్కరి ఆరోగ్యానికి అమ్మే మొదటి డాక్టర్. ఏ చిన్న సమస్య వచ్చినా తను ముందు బాధపడుతుంది. ప్రథమ చికిత్స చేసేది అమ్మే… పిల్లల ఆరోగ్యంతో పాటు కుటుంబ పాలన కూడా అన్నీ తానై చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. అందుకే ఈ వరల్డ్ మదర్స్ డే సందర్భంగా అమ్మకు ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేయించండి.

తల్లులు పాటించాల్సిన ఆరోగ్య చిట్కాలు:

క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి,  సమతుల ఆహారం తీసుకోవాలి,  పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఆహారం,  ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి,  తగినంత నిద్ర పోవాలి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి,  ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి

మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం అవసరం

ఇంటి పనులు, ఉద్యోగం, పిల్లల సంరక్షణ ఈ మూడు బాధ్యతల మధ్య మహిళలు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులు తల్లులకు భావోద్వేగ సహాయం అందించడం ఎంతో ముఖ్యం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *