NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోష్ చట్టం: కార్యస్థలాల్లో మహిళల సురక్షకు గట్టి కవచం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు వారి ఆధ్వర్యంలో రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో పోష్ చట్టం మరియు మహిళా సాధికారకత అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ  కార్యస్థలాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ‘పోష్ చట్టం’  ప్రధాన ఆయుధంగా మారిందని,2013 డిసెంబర్ 9న అమలులోకి వచ్చిన ఈ చట్టం, మహిళలకు సురక్షిత పని వాతావరణాన్ని కల్పిస్తూ, వేధింపులకు వేగవంతమైన పరిష్కారాలు అందిస్తుందని తెలిపారు. ప్రధాన వక్త డాక్టర్ మాధవి శ్యామల పోష్ చట్టం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని,ఫిర్యాదు చేసిన మహిళలు 3-6 నెలల్లోపు న్యాయం పొందవచ్చని వివరించారు. విశాఖా జడ్జిమెంట్ (1997) నుంచి ప్రారంభమైన ఈ పోరాటంలో ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్ట్మెంట్ అట్ వర్క్ ప్లేస్ చట్టం మైలురాయిగా నిలిచిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లను డిస్ట్రిక్ట్ ఆఫీసర్లుగా నియమించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా అమలు బలపడిందని,అధికారులు, విద్యార్థులు మరియు ప్రజలు అందరూ ఈ చట్టం గురించి తెలుసుకోవాలని, మహిళల సురక్షకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు నజీమా కౌషర్ వినియోగదారుల రక్షణ చట్టం పై అవగాహన కల్పించారు.ఈ చట్టం వినియోగదారులకు తప్పుదారి పట్టించే ప్రకటనలు, డిఫెక్టివ్ వస్తువులు, సేవల లోపాలపై ఫిర్యాదు చేసే సౌలభ్యాన్ని అందిస్తుందని తెలిపారు.ఈ-కామర్స్, ఆన్‌లైన్ లావాదేవీలు కూడాఈ చట్టం పరిధిలోకి చేర్చబడ్డాయన్నారు.  వినియోగదారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్ల ద్వారా మరియు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా పిర్యాదు చేయవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఉషశ్రీ, సెట్కూరు సిబ్బంది నిదీష్ కుమార్, శ్రీనివాస్ సింగ్, మౌలాలి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author