NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోపూజతో ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

వెల్దుర్తి, న్యూస్​ నేడు:  వెల్దుర్తి మండలం, మల్లేపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానము నందు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గత ఐదురోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో ముగిశాయి.  శ్రీమద్రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలలోని ధర్మ సూక్ష్మాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కవి రాజహంస డాక్టర్ తొగట సురేశ్ బాబు చేసిన ప్రవచనాలు భక్తంలను ఎంతగానో ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయ అర్చకులు తిరునగరి రంగస్వామి, గ్రామ పెద్దలు కారం రామిరెడ్డి, భజన మండలి అధ్యక్షులు కె. రుక్మాంగధ రెడ్డి, హార్మోనిష్ఠు గొల్ల చిన్నయ్య, తబలిస్ట్ టి. రామాంజనేయులు, భజన మండలి సభ్యులు వి. శేఖర్, భాష్యం శీలయ్య,  చిన్న మాధన్న, సూర మాదన్న, ఎల్లయ్య, వి. రామకృష్ణ, సుంకన్న, చిన్న గోవింద రెడ్డి, బి. మద్దిలేటి, యం. చిన్న రాముడు, పి. సిద్దయ్యతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *