రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేద్దాం
1 min read
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు : పట్టణంలో ఈనెల 26 27,28 కడప జిల్లాలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక రాజకీయా శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎమ్మిగనూరు సిపిఐ కార్యాలయంలో శిక్షణ తరగతు ల కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు విష్ణు, ఖాదర్ తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు సంవత్సర కావస్తున్న ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తల్లికి వందనం కింద విద్యార్థులకు 15వేల రూపాయలు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 3400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్ట్లు భర్తీ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని వారు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చైనా (శ్రీ చైతన్య నారాయణ) విద్యాసంస్థలు అక్రమ అడ్మిషన్లు అక్రమ ఫీజులు వసూలు చేస్తున్న వాటిపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు తెలిపారు. నిదానంగా సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 26 నుండి 28 తేదీ వరకు కడప జిల్లాలో జరుగుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర విద్య వైద్యానికి రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నదీమ్, అంజి బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.