గాంధీ ఆశయ సాధనకు కృషి: మేయర్ నూర్జహాన్ పెదబాబు
1 min readపల్లె వెలుగు వెబ్,ఏలూరు: నగరపాలకసంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.గాంధీ జయంతి వేడుకలను ఆదివారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కార్యాలయ ప్రాంగణంలో గ్రామదీప్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత వస్తువులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్.సుధీర్ బాబు కమిషనర్ షేక్ షాహిద్ లతో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని, నేటితరం యువత మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు.ప్లాస్టిక్ నిషేధం పై ప్రజల్లో చైతన్యం ప్రజల ప్రాణాలకు హానికరమైన ప్రభుత్వం నిషేధించిన 18 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణానికి హానికరం లేని వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందనీ, దాంతో పాటు ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలను చైతన్య పరచడం జరుగుతుందన్నారు. 75 మైక్రాన్ కన్నా ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ ను మాత్రమే వాడలని, అంతకన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వాడినట్లయితే అవి భూమిలో కలవకపోవడం వలన జంతువులు వాటినీ తినడం అనారోగ్యాల బారిన పడి జంతువులు ప్రాణాలుపోతున్నాయన్నారు. హోటల్స్ లో ఇస్తున్న క్యారీ బ్యాగులు కారణంగా మనుషుల ప్రాణాలు కూడా హాని ఉందనీ, కాబట్టి ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించాలనీ ఆమె కోరారు. ప్లాస్టిక్ వస్తువులు నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న గ్రామదీప్ స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ వి.మనోహరి ని మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం ప్లాస్టిక్ వస్తువుల నిషేధంపై విద్యార్థుల్లో చైతన్య కల్పించేందుకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, మెమొంట్లను అందించారు.
పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణీ
నగరపాలకసంస్థ పర్మినెంట్ పారిశుధ్య కార్మికులకు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా బట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సి.హెచ్.వి.వి.ఎన్ బాపిరాజు, డిప్యూటీ కమిషనర్ కర్రి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల, సబ్బన శ్రీనివాస్,మునగల కేదారేశ్వరి జగదీష్, అద్దంకి హరిబాబు, తంగెళ్ళ రాము, కలవకొల్లు సాంబ, వివిధ విభాగల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.