మాదేపల్లిలో మహాలక్ష్మి అమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
1 min read
ఎమ్మెల్యే కి తీర్థప్రసాదాలు అందజేసిన కమిటీ సభ్యులు
నియోజకవర్గ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో శ్రీ మహాలక్ష్మీ అమ్మ , శ్రీ గంగానమ్మ, శ్రీ పోతురాజు బాబు,శ్రీ మద్ధిరావమ్మ వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ మరియు మాదేపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలుగా ఉండాలని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు, నిర్వాహ కమిటీ సభ్యులు ఆహ్వానించి తీర్థ ప్రసాదలను ఎమ్మెల్యే చింతమనేనికి అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆయన వెంట గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
